AMARAVATHINATIONAL

న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపిన G-20 దేశాధినేతల సదస్సు

ఉమ్మడి ప్రకటన విడుదల..
అమరావతి: న్యూఢిల్లీ G-20 దేశాధినేతల సదస్సు శనివారం ప్రకటన విడుదల చేసింది..“ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించి బాలిలో జరిగిన చర్చలను పునరుద్ఘాటిస్తూ,, తాము ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపును పునరుద్ఘాటించాము..11/1, A/RES/ES-11/6) ప్రతిపాదనలపై తన జాతీయ స్థానాన్ని పునరుద్ఘాటించింది..ఐక్యరాజ్యసమితి చార్టర్లోని లక్ష్యాలు, సూత్రాలకు అనుగుణంగా అన్ని దేశాలు పనిచేయాలని కూడా నొక్కిచెప్పారు..యూఎన్ చార్టర్ కు అనుగుణంగా,,అన్ని దేశాలు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం లేదా ఏదైనా దేశ రాజకీయ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ప్రాదేశిక స్వాధీనానికి లేదా బలప్రయోగానికి ముప్పు నుంచి దూరంగా ఉండాలి..ఏదైనా దేశంపై అణ్వాయుధాలను ఉపయోగించడం లేదా బెదిరించడం కూడా ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.
ఏకగ్రీవం:- G20 సభ్య దేశాలన్నీ ఉమ్మడి మేనిఫెస్టోకు తమ సమ్మతిని తెలిపాయి..ఆనంతరం అది ఏకగ్రీవంగా ఆమోదించబడింది..
ఉమ్మడి మేనిఫెస్టో:- ఈ సందర్బంగా ఉమ్మడి మేనిఫెస్టో గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,,‘‘ఒక గుడ్ న్యూస్ ఉంది.. మా బృందం కృషి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మద్దతుతో న్యూ ఢిల్లీ G20 లీడర్ల సమ్మిట్ డిక్లరేషన్ ఏకాభిప్రాయానికి చేరుకుంది’’ అని చెప్పారు.. దీనిని G20 నాయకులందరూ స్వీకరించాలని, ఇది జరుగుతుందని తాను ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు..ఇది సాధ్యమయ్యేలా కృషి చేసిన మంత్రులకు, షెర్పాలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాని అన్నారు..
బయోప్యూయిల్:- ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు భారత్ ప్రకటించింది..దీనిపై సభ్యదేశాలన్నీ పనిచేయాలని, జీవ ఇంధనాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భారత్ సూచించింది..పెట్రోల్లో దాదాపు 20 శాతం ఇథనాల్ కలిపేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు..లేకపోతే సరికొత్త ప్రత్యామ్నాయ మిశ్రమాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు..ఈ పనులు చేస్తే పర్యావరణ పరిరక్షణకు కృచేస్తూనే,,ఇంధన సరఫరాకు లోటు లేకుండా చూసుకోవచ్చని తెలిపారు..ప్రపంచంలో పర్యావరణంలో భారీగా మార్పులు సంభవిస్తున్న వేళ ఇంధన పరివర్తన 21వ శతాబ్దానికి చాలా ముఖ్యమని చెప్పారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *