AMARAVATHIPOLITICS

పొత్తుల విషయంలో పెద్ద మనస్సుతో పవన్ కళ్యాణ్ సర్దుకుపోవడానికి కారణం?-హరిరామ జోగయ్య

అమరావతి: జనసేన- టీడీపీ ఎన్నికల పొత్తు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య ముఖసూటిగా అయన అభిప్రాయం వ్యక్తం చేశారు..పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన నివాసం నుంచి ఓ లేఖను విడుదల చేశారు.. ఈ లేఖలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల కేటాయింపు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పొత్తు ధర్మంలో జనసేనను విస్మరిస్తూ చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను మండపేట,, అరకు నియోజకవర్గాలకు ప్రకటించడం తప్పని,,ఇలాంటి చర్య పొత్తు ధర్మాన్ని విస్మరించడమే అవుతుందని హరిరామ జోగయ్య పేర్కొన్నారు..చంద్రబాబు ప్రకటనకు ప్రతిగా పవన్ కల్యాణ్ జనసేనకు పట్టుకొమ్మలైన రాజోలు,, రాజానగరం సీట్లను ప్రకటించినప్పటికీ జనసైనికులు సంతృప్తి చెందడం లేదని హరిరామ జోగయ్య లేఖలో అభిప్రాయం వ్యక్తం చేశారు.. సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి,, ఉంగుటూరు,, తణుకు,, నిడదవోలు నియోజకవర్గాలను జనసేనకు ప్రకటించినట్లయితే పవన్ కల్యాణ్ కు ఎంత నిబద్దత ఉందో అనే విషయం స్పష్టం అయ్యేదన్నారు.. పొత్తులో భాగంగా 25 నుంచి 30 స్థానాలు మాత్రమే జనసేనకు కేటాయిస్తే,, 25 సంవత్సరాల యువత భవిష్యత్తుకు పెద్దపీట వేస్తామన్న పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు అర్థం లేకుండా పోతుందని వెల్లడించారు..తక్కువ స్థానాలకు పవన్ కల్యాణ్ ఒప్పుకుంటే సదరు పొత్తు విఫల ప్రయోగంగా మారే ప్రమాదం లేకపోలేదన్నారు.. 2024 ఎన్నికలకు జనసేనతో పొత్తు టీడీపీ మనుగడకు అత్యవసరమని,, టీడీపీ నాయకులు,, క్యాడర్ ఈ విషయం గుర్తుంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *