AMARAVATHI

కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించకుండానే రాజకీయ ఒప్పందాలు-పవన్ కల్యాణ్

జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించం…

అమరావతి: కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించకుండానే రాజకీయ ఒప్పందాలు ఉంటాయని,,అవమానపడి,,మనల్సి తగ్గించుకునే స్థాయిలో ఒప్పందాలు ఉండవని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు.ఆదివారం మంగళగిరిలో కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరిరామ రామజోగయ్య నాయకత్వంలో కాపు సంక్షేమ శాఖ ప్రతినిధులతో జనసేనాని సమావేశం అయ్యారు..ఈ సమావేశంలో పవన్ కీలక పై వ్యాఖ్యలు చేశారు..అయన మాట్లాడుతూ జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించం అన్నారు..మేం ఏ పార్టీ అజెండాను మోయము అని తేల్చి చెప్పారు..రూ.1000 కోట్లు ఆఫర్ అని ఒకరంటారు,, రూ.1000 కోట్లు తీసుకుంటే పార్టీని నడపగలమా..? సంకల్పం లేకుంటే రూ.10వేల కోట్లున్నా పార్టీ నడపలేము అన్నారు.. సీఎం కుటుంబం దగ్గరున్న మైన్స్ బలిజలకు చెందినవే,,కానీ పోటీ తట్టుకోలేక వెనుకపడ్డారని పవన్ అన్నారు..”కోస్తాలో కాపులు గొంతెత్తగలరు కానీ సీమలో బలిజలు గొంతెత్తే పరిస్థితి లేదు..నువ్వెంత ఎదిగినా నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకోవాలనే ధోరణి సీఎం జగన్ మోహన్ రెడ్డిదన్నారు..మనల్ని వెన్నుపోటు పొడిచే వారు ఎవరో ఉండరు…మనతో ఉన్న వాళ్లే ఉంటారు…నేను ఓడిపోతే మీసాలు మెలేసి తొడగొట్టింది కాపులే…నేను ఓడిపోతే మీకేంటీ ఆనందం? నన్ను బీసీ,,ఎస్సీ,, కాపులతో తిట్టిస్తారు కానీ మిగిలిన అగ్రకులాలు వాళ్లు ఎందుకు తిట్టరు..? వాళ్లు మంచి వాళ్లుగా ఉండాలి…మనలో మనం కొట్టుకోవాలి…ఇదే వాళ్ల వ్యూహం…దీన్ని గుర్తించినంత వరకు రాజ్యాధికారం దక్కదు…కాపులు, బీసీలు సంఘాలుగా విడిపోయాయి…కాపులు పెద్దన్న పాత్ర పోషించి బీసీ, ఎస్సీలను కలుపుకుని వెళ్లాలి…రెడ్డి, కమ్మ వర్గాలతో గొడవలు పెట్టుకోకూడదు…ద్వేషించొద్దు…అగ్ర వర్ణాలను గౌరవించడమంటే లొంగిపోయినట్టు కాదు” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

చేగొండి హరిరామ రామజోగయ్య:- ఎన్నికల్లో గెలిచేందుకు ఏ పార్టీతో పొత్తుకు వెళ్ళినా మాకు పర్వాలేదు అయితే ముఖ్యమంత్రి సీటులో పవన్ కళ్యాణ్ కూర్చోవాలి, కాపులకు న్యాయం మీ ద్వారా జరగాలి అనేదే మా ఆకాంక్ష అన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *