AMARAVATHIDISTRICTS

ఎన్నికల ప్రక్రియలో సెక్టోరల్‌ ఆఫీసర్ల పాత్ర అత్యంత కీలకం- జిల్లా ఎన్నికల అధికారి

మే 8లోగా ఓటరు స్లిప్పుల పంపిణీ

నెల్లూరు: ఎన్నికల ప్రక్రియలో సెక్టోరల్‌ ఆఫీసర్ల పాత్ర అత్యంత కీలకమని, పోలింగ్‌ ముగిసే వరకు బాధ్యతాయుతంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా విధులను నిర్వహించాలని జిల్లాఎన్నికల అధికారి, హరి నారాయణన్‌ సూచించారు. శనివారం నగరపాలక సంస్థలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నెల్లూరుసిటీ, రూరల్‌, కోవూరు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని సెక్టోరల్‌ అధికారులకు పోలింగ్‌కు ముందు, పోలింగ్‌ రోజు నిర్వహించాల్సిన విధుల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు.

పోలింగ్‌కు ముందు 3 గంటలు చాలా కీలకం:- మే 13 పోలింగ్‌ రోజున మాక్‌పోల్‌ ప్రక్రియ పట్ల పివోలు, ఏపివోలు అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రక్రియను సెక్టోరల్‌ అధికారులు పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. పోలింగ్‌కు ముందురోజే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్నచోటే సిబ్బంది బస చేయాలని, తెల్లవారుజామున 4.30 గంటలకు నిద్రలేచి 5.30 గంటలకల్లా మాక్‌పోలింగ్‌ నిర్వహించేందుకు సమాయత్తం కావాలన్నారు. జిల్లాలో సుమారు 1200పైగా పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటుచేస్తున్నామని, వెబ్‌కాస్టింగ్‌ కెమెరాలను పరిశీలించి, మొత్తం ప్రక్రియ కవర్‌ అయ్యేలా అనువైన ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని, దీనిని పరిశీలించి సెక్టోరల్‌ అధికారులు సర్టిఫికెటు ఇవ్వాలన్నారు.

మే 8లోగా ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలి:- ఓటర్లకు డోర్‌ టు డోర్‌ ఓటరు స్లిప్పులను బూత్‌ లెవల్‌ అధికారుల ద్వారా అందించే బాధ్యత సెక్టోరల్‌ ఆఫీసర్లదే అన్నారు. మే 8 నాటికి అన్ని ఓటరు స్లిప్పులను ప్రతి ఇంటికి అందించాలని, మిగిలిన స్లిప్పులను ఆర్వోకు అందించాలన్నారు. మార్క్‌ డ్‌ కాపీ, ఎఎస్‌డి (అబ్సెంటీస్‌, షిప్టెడ్‌, డెత్‌) జాబితాను తయారు చేసుకోవాలని సూచించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *