బంగాళాఖాతంలో అల్పపీడనం-రెండు రోజుల పాటు వర్షాలు-వాతావరణశాఖ

అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత క్రమంగా తుఫానుగా మారి గురువారం ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు – దక్షిణకోస్తా తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో, గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, YSR, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మత్స్యకారులు గురు,శుక్రవారాల్లో తమిళనాడు – దక్షిణకోస్తా తీరప్రాంత సమీపంలో వేటకు వెళ్ళరాదు.