AMARAVATHIPOLITICS

వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి,పంచాయతీ వ్యవస్థకు పోటీగా నడుపుతున్నారు-పవన్

అమరావతిం రాష్ట్రంలో పాలనా వ్యవస్థ ఆస్థవ్యస్థమైందని,,పంచాయితీల నిధుల దుర్వినియోగం జరగడమే కాకుండా రాజ్యాంగ హక్కులను కాలరాసేలా కొన్ని సమాంతర వ్యవస్థలను తయారు చేస్తున్నారని జనసేన అధ్యక్షులు పవన్ ఆరోపించారు..శనివారం మంగళగిరి పార్టీ కార్యలయంలో పంచాయితీ రాజ్ వ్యవస్థలో సర్పంచుల అధికారం,,నిధులు అనే ఆంశంపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్ల గురించి మరోసారి ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి.. రాష్ట్రంలో పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారనీ,, నిధులు పక్కదారి పట్టిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు..నిధులను మళ్లించడాన్ని దోపిడీలాగే చూడాలని,,అధికారం ఉందని చెప్పి నిధులను దారిమిళ్లిస్తారా అంటూ నిలదీశారు..దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలన్నారు.. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి,, పంచాయతీ వ్యవస్థకు పోటీగా నడుపుతున్నారనీ,, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు..డబ్బులు ఖర్చు పెట్టి, కష్టపడి ఎన్నికల్లో గెలిచిన సర్పంచులకు కనీస హక్కులను కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు..అంతే కాకుండా సర్పంచ్ ల ఏకగ్రీవాన్ని కూడా తప్పుబట్టారు.. బెదిరింపులు, ఒత్తిడిలతో ఏకగ్రీవం చేసుకుంటున్నారనీ,,ఎన్నికల్లో పోటీ చేసే హక్కుకు భంగం కలిగిస్తున్నారన్నఅభిప్రాయం వ్యక్తం చేశారు.. సర్పంచ్ లకు సంపూర్ణంగా చెక్ పవర్ ఉండలని,,భవిష్యత్తులో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా జనసేన అడుగు వేస్తుందన్నారు..దీనిపై మేధావులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *