వేరే దిక్కులేదు-భారత్ నుంచే దిగుమతి చేసుకొవాలి

అమరావతి: పాకిస్తాన్ లో నెలకొన్న తీవ్ర ఆర్దిక సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్న సమయంలోనే వరద భీభత్సంతో దిక్కుతోచని పరిస్థితిలోకి జారిపోయారు..కనీసం ఒక పూట తిండి అయిన దొరకాలంటే,,ఎదొఒక పనిచేసుకొవాల్సిందే..కార్మికులకు పని ఇదామా అంటే,,వ్యాపారస్తులకు ముడి సరుకు దొరకని సంకట స్థితి..పాకిస్తాన్ లోని వస్త్రపరిశ్రమపై ఆధారపడి ఎగుమతులు చేసే వ్యాపారస్తుల పరిస్థితి దారుణంగా మారిపోయింది అనేందుకు ఉదాహరణ….భారత దేశంలో ఉత్పత్తి చేసే పత్తిని కొనాలంటూ పాకిస్తాన్‌కు చెందిన టెక్స్ టైల్ వ్యాపారులు, అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు..అక్కడ వస్త్రపరిశ్రమ వ్యాపారులు తీవ్రమైన పత్తి కొరత ఎదుర్కొంటున్నారు..ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ను భారీ వరదలు ముంచెత్తాయి..వరదల ధాటికి దేశంలో నిల్వ ఉన్న పత్తిలో దాదాపు 25 శాతంపైగా పాడైపొయింది..రాబోయే రోజుల్లో పత్తి ఉత్పత్తి కూడా తగ్గిపోనుంది..దీంతో పత్తిపై ఆధారపడి పనిచేసే టెక్స్ టైల్ వ్యాపారులు తీవ్రమైన ముడి సరుకు కొరత ఎదుర్కొంటున్నారు..ఈలాంటి పరిస్థితిలో తమ వ్యాపారాలు మనుగడ సాగించాలంటే భారతదేశం నుంచి కాటన్ దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గమని సూచిస్తున్నారు.. భారత్-పాక్ సరిహద్దు అయిన వాఘా నుంచి రోడ్డు మార్గంలో పత్తి దిగుమతి చేసుకునేందుకు అంగీకరించాలని పాక్ ఆర్థిక శాఖా మంత్రి మిఫ్తా ఇస్మాయిల్‌ను కోరారు..మన దేశం నుంచి 2.5 మిలియన్ బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలని సూచించారు..చైనాకు వంత పాడుతూ,,భారతదేశంలో ఉగ్రవాదంను ఎగదొసే పాకిస్తాన్,,మన దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాల్ని మెరుగుపర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ఆ దేశంలో తీవ్ర ఆహార కొరత ఉండటంతో, దీన్ని ఎదుర్కోవాలంటే భారత్ నుంచి ఆహారోత్పత్తులు దిగుమతి చేసుకోవడం ఒక్కటే మార్గమని భావిస్తోంది..