నెల్లూరు: సోమిరెడ్డి వ్యవసాయశాఖ మంత్రిగా వున్నప్పుడు,రైతులకు ఎంతో మేలు జరిగిందని,,మీ మంత్రి లాగా,, కృష్ణపట్నంలో బూడిద అమ్ముకున్నారా,,గ్రావెల్ కొండను మాయం చేశారా,,పంటపాళెంలో టొల్ గేటు పెట్టి ఆయిల్ ట్యాంకర్ల దగ్గర డబ్బులు దండుకున్నారా అంటు మంత్రిపైన,,వైసీపీ నాయకులను తీవ్రస్థాయిలో తిరుపతి జిల్లా రైతు పార్లమెంట్ అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణ నాయుడు విమర్శంచారు.సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేసి,,వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వెంకటశేషయ్య చేసిన విమర్శలకు పై విధంగా స్పందించారు.ఈ కార్యక్రమంలో వెంకటాచలం మండలం తెలుగుదేశం అధ్యక్షుడు గుమ్మడి రాజ,, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.