ముత్తూకూరు గేటు వద్ద 12వ తేది(సోమవారం) నుంచి ట్రాఫిక్ మళ్లీంపు-డీస్పీ సుభాన్

నెల్లూరు: హరనాథపురం వద్ద ముత్తుకూరు జంక్షన్ వద్ద నిర్మిస్తున్న4- లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం కీలక దశకు చేరుకున్న నేపధ్యంలో సెప్టంబరు 12వ తేది నుంచి 26వ తేది వరకు ముత్తుకూరు గేట్ జంక్షన్ మూసివేసి ట్రాఫిక్ ను మళ్లీంచడం జరుగుతుందని ట్రాఫిక్ DSP.MD.అబ్దుల్ సుభాన్ అదావారం తెలిపారు.ఇందులో భాగంగా ఆ జంక్షన్ మధ్యలో 150 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు, 140 టన్నుల బరువు వున్న భారీ కాంక్రీట్ గర్డర్ లను, భారీ క్రేన్ ల సహాయంతో పైకి ఎత్తి పిల్లర్ పై బిగించవలసి వుందన్నారు..ఇందు కోసం నాలుగు భారీ క్రేన్ లను ఉపయోగిస్తున్నారని తెలిపారు. 20 గర్డర్ లను పిల్లర్ పైన బిగించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు, దీని వల్ల 45 రోజులు జరగాల్సిన పనిని కేవలం 15 రోజులలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు..
ట్రాఫిక్ డైవర్షన్ ఇలా:-
1) V.R.C నుంచి ముత్తుకూరు జక్షన్ వచ్చే బస్సులను,,ట్రంక్ రోడ్డు మీదుగా P.S.R బస్టాండ్ అండర్ బ్రిడ్జి ద్వారా దారి మల్లించారు.
2) ముత్తుకూరు రోడ్డు నుంచి ముత్తుకూరు జంక్షన్ వచ్చే బస్సులు సర్వేపల్లి కాలువ బ్రిడ్జికి ముందు వున్న ముత్తుకూరు బస్టాండ్ వద్దే U – టర్న్ తీసుకోవాలి..
తేలిక వాహనాలు (కార్లు, ఆటోలు, చిన్న స్కూల్ వాన్లు, ద్విచక్ర వాహనాలు):-
1) V.R.C నుంచి ముత్తుకూరు జక్షన్ వచ్చే తెలీక వాహనాలు రామలింగా పురం, ముత్యాల పాలెం రైల్వే అండర్ బ్రిడ్జిల గుండా శ్రీహరి నగర్, నారాయణ స్కూల్ దారిలో నుంచి మినీ బైపాస్ లోకి మల్లించారు.
2) ముత్తుకూరు రోడ్డు, చిల్డ్రన్స్ పార్కు నుంచి ముత్తుకూరు జంక్షన్ వచ్చే తేలిక వాహనాలు ఆదిత్య నగర్, బాలాజీ నగర్ గుండా సర్వేపల్లి కాలువ పై వున్న బాలాజీ నగర్ బ్రిడ్జి, ఫూలే విగ్రహం బ్రిడ్జి పైగా దారి మల్లించారు.
3) ముత్తుకూరు జంక్షన్ నుండి బీవీ నగర్ వైపు వెళ్లే వాహనాలు NH-16 మీదుగా , గోలగమూడి జంక్షన్, వనం తోపు, అన్నమయ్య సర్కిల్ గుండా దారి మల్లించిండం జరిగిందని,ట్రాఫిక్ క్రమబద్దీకరణకు నగర ప్రజలు సహకరించాలని డీస్పీ కోరారు.