జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 భవిష్యతులో తిరిగి రాదు-గులాం నబీ ఆజాద్

అమరావతి: జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 భవిష్యతులో తిరిగి రాదని కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు..కొన్ని పార్టీలు ఆర్టికల్ 370 కశ్మీరీల్లో అపోహలను కల్పిస్తున్నారని, తాను మాత్రం అలాంటి అపోహలకు తావివ్వబోనని ఆయన పేర్కొన్నారు..ఆదివారం ఉత్తర కశ్మీర్ అయిన బారాముల్లాలో బహిరంగ సభ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ “గులాం నబీ ఆజాద్ ఎవరినీ తప్పుదోవ పట్టించాలని అనుకోవడం లేదు. ఓట్ల కోసం ఎవరికీ అబద్ధాలు చెప్పదల్చుకోలేదు.సాధ్యం కాని విషయాలపై చర్చలు, భావోద్వేగాలు రెచ్చగొట్టొద్దని నేను విజ్ణప్తి చేస్తున్నాను. ఆర్టికల్ 370 ఇక ఎప్పటికీ తిరిగి రాదు. దానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. అది కశ్మీర్ నుంచి సాధ్యం కాదు” కుండబద్దలు కొట్టారు..ఆర్టికల్ 370 తీసుకొచ్చే పరిస్థితిలో ఏ పార్టీ లేదని,,కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ మరింత మునుగుతోందని, ఇక ప్రాంతీయ పార్టీల శక్తిసామర్థ్యాల గురించి చెప్పక్కర్లేదన్నారు.. జమ్మూ కశ్మీర్కు రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని ఆగస్టు 5, 2019లో పార్లమెంట్ రద్దు చేసింది. అప్పటి నుంచి కశ్మీర్లో వివిధ రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని,,ఇదే విషయమై రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి గుప్కార్ అలయెన్స్గా ఏర్పాటై డిమాండ్ చేస్తున్నాయి..