AMARAVATHICRIME

టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ-చార్జీంగ్ అయిపోవడంతో..

తిరుమల: తిరుమలలో శ్రీవారి ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సును శనివారం రాత్రి చార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకు చార్జింగ్ పెట్టిన డ్రైవర్ ప్రక్కకు వెళ్లాడు..తిరిగి వచ్చి చూడగా చార్జీంగ్ లో వుండాల్సిన బస్సు కనిపించకపోవడంతో అధికారులకు సమాచారం అందించాడు..సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో అందరూ బిజీ గా వున్న సమయంలో,,దుండగుడు విద్యుత్ బస్సును డ్రైవ్ చేసుకుంటు వెళ్లాడు..డ్రైవర్ అందించిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి బస్సు కోసం గాలింపు చేపట్టారు..GPS లొకేషన్ ఆధారంగా సదరు బస్సు నాయుడుపేట బైపాస్ రోడ్డు వద్ద ఉన్నట్లు గుర్తించారు..బస్సులో చార్జీంగ్ అయిపోవడంతో దుండగుడు ఆదివారం తెల్లవారుజామున 3.53 గంటలకు రోడ్డులో వదిలి పరారీ అయ్యాడు..
టీటీడీ ఎలక్ట్రికల్ ఉచిత బస్సు చోరీకి గురికావడం ఇది రెండవసారి..గతంలోనూ టీటీడీకి చెందిన బ్యాటరీ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి చేశారు..బ్యాటరీ వాహనంలో చార్జింగ్ అయిపోవడంతో,,కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద వదిలి వెళ్లారు..ఇలాంటి సంఘటన చోటు చేసుకోవటంతో అధికారుల నిఘా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
బస్సు చోరీ ఘటన నేపథ్యంలో,,టీటీడీ ట్రాన్స్ పోర్టు GM శేషారెడ్డిపై పోలీసులు సీరియస్ అయ్యారు… వారంరోజుల క్రితం కారు మిస్సింగ్ ఘటనపై కూడా పోలీసులకు ట్రాన్స్ పోర్టు GM శేషారెడ్డి సమాచారం అందించలేదని తెలుస్తొంది..ఆదివారం బస్సు మిస్సింగ్ ఘటనలోనూ మీడియాలో వార్తలు వచ్చే వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు..భక్తులకు సంభంధించిన వాహనాలకు,,రవాణా వాహనలకు పూర్తి స్థాయిలో భధ్రతా ఏర్పాట్లు పరిశీలన జరిపి,,పూర్తి బాధ్యతను జీయం తీసుకొవాలని పోలీసులు సూచించారు..వాహనాలు చోరికి గురైనా సమాచారం అందించకపోవడంతో FIRలో GM శేషారెడ్డి పేరు చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.. FIRలో GM పేరు చేర్చితే,,అతన్ని సస్పెండ్ చేసే యోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం..అది ఎట్లా జరగదు???

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *