AMARAVATHI

చైనీస్ మాంజా దారాల విక్రయాలపై ఉక్కుపాదం

 అమరావతి: చైనీస్ మాంజా దారాల విక్రయాలపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు..గత వారం (నెల 25వ తేదిన) హైదర్ పూర్ ఫ్లై ఓవర్ మీదుగా బైక్ పై వెళ్తున్న ఓ యువకుడి మెడకు మాంజా అడ్డుపడటంతో అతడి గొంతుకు తీవ్ర గాయమైంది..ఆప్రమత్తంమైన స్థానికులు,,అతడ్ని హాస్పిటల్ కు తరలించగా,,అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు..ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో,, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది..దింతో అక్రమంగా చైనా  మాంజా విక్రయ స్థావరాలపై ముప్పెట దాడులు చేస్తున్నట్లు అవుటర్ ఢిల్లీ డీసీపీ సమీర్ శర్మ తెలిపారు..దాడుల్లో 11మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 59 చైనీస్ మాంజా రోల్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు..ఇదే సమయంలో నార్త్ వెస్ట్ ఢిల్లీ పోలీసుల స్పెషల్ టీమ్ ఓ గోదాముపై దాడి చేసి 11,760 చైనీస్ మాంజా రోల్స్‌ ను స్వాధీనం చేసుకుని,,అమర్జీత్ అనే మాంజా డీల‌ర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు..అమర్జీత్  ఒక కోడ్‌ వర్డ్‌ ద్వారా దుకాణదారులకు చైనీస్‌ మాంజాను సరఫరా చేసేవాడని నార్త్ వెస్ట్ ఢిల్లీ డీసీపీ ఉషా రంగ్ తెలిపారు.. మోనో కైట్ మాంజా బ్రాండ్ పేరుతో 400 చైనీస్ మాంజా కార్టన్‌లను నోయిడాలోని ఒక డీల‌ర్ నుండి నెల రోజుల క్రితం కొనుగోలు చేసినట్లు అమర్జీత్ పోలీసుల విచారణలో వెల్లడించాడు..ఈ మాంజా సూరత్ నుంచి ట్రక్కులో ఢిల్లీకి చేరుకుంటుందని,,అలా వచ్చిన మంజాను,,అమర్జీత్ అద్దెకు తీసుకున్న ఓ గోడౌన్‌లో నిల్వ చేసి ఢిల్లీలోని NCR లోని దుకాణదారులకు విక్రయిస్తున్నాడని గుర్తించడం జరిగిందన్నారు.. 2017లో  చైనీస్ మాంజాపై కేంద్ర ప్రభుత్వ నిషేధం విధించింది. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *