AMARAVATHINATIONAL

తొలిసారిగా సమావేశమై జమిలి ఎన్నికల నిర్వహణ సూచనల కమిటీ

అమరావతి: జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశమైంది.. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింగ్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ శనివారం తొలిసారిగా సమావేశమై,,జమిలి ఎన్నికల నిర్వహణకు అవసరమైన అభిప్రాయాలు,,సలహాలు,,సూచనలను గుర్తింపు పొందిన జాతీయ,రాష్ట్రా స్థాయి రాజకీయ పార్టీల నుంచి తీసుకుంటామని స్పష్టం చేసింది..కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఈ సమావేశానికి హాజరు కాలేదని కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది..కార్యాచరణ ప్రణాళికలు,,అధికారిక సంప్రదింపులు ఎలా జరపాలన్న అంశంపై కమిటీ చర్చిందని తెలియచేసింది.. విధి,విధాలకు సంబంధించి కేంద్రం నిర్దేశించిన సూచనలను దృష్టిలో వుంచుకుని తగిన పేపర్ వర్క్ తయారు చేయడం,,అవసరమైన విషయాల పై లోతుగా విశ్లేషించడంపై చర్చలు జరిగినట్లు వెల్లడించింది..ఒకే దేశం-ఒకే ఎన్నిక నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్రం ఎనిమిది నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది..ఇందులో ప్రతిపక్ష నేతలతో పాటు శాసన,,న్యాయ,,ఆర్థిక నిపుణులకు స్థానం కల్పించింది..అలాగే కేంద్ర హోంశాక మంత్రి అమిత్ షా,,రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్,,15వ ఆర్థిక సంఘం మాజీ చైర్మన్ ఎంకే సింగ్,, సీనియర్ అడ్వకేట్ హరీష్ సాల్వే లోకసభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాష్ కశ్యప్,,మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొటారిలు ఉన్నారు.

https://x.com/ANI/status/1705545310792237256?s=20

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *