AMARAVATHI

విశాఖే పరిపాలనా రాజధాని-సీ.ఎం జగన్

అమరావతి: విశాఖపట్నంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో సీఎం జగన్ ప్రసంగిస్తూ కీలక ప్రకటన చేశారు.. విశాఖే పరిపాలనా రాజధాని,,తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానని,,ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానని ముఖ్యమంత్రి అన్నారు..శుక్ర,,శని వారం జరుగనున్న ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవ ఉపన్యాసంలో సీ.ఎం మాట్లాడుతూ భారతదేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని ఆయన తెలిపారు..ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం వెల్లడించారు..దిని ద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు..ఏపీ గ్రోత్ రేట్ 11.14 శాతంగా ఉందని చెప్పారు..గ్రీన్ ఎనర్జీపై ఫోకస్ పెట్టాలని,, దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే,, అందులో 3 పారిశ్రామిక కారిడార్లు ఏపీలోనే ఉన్నాయని జగన్ తెలిపారు.. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయని చెప్పారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *