AMARAVATHIPOLITICS

వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచాలి-టీడీపీ,జనసేన

బైండోవర్ కేసులు పెడుతున్నారు…
అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని టీడీపీ,,జనసేన అధినేతలు చంద్రబాబు,,పవన్ కళ్యాణ్ లు చెప్పారు.మంగళవారం తర్వలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత,,ఓటర్ల జాబితాపై విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది..ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొని రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై CECకి ఫిర్యాదు చేశారు.. టీడీపీ, జనసేనలకు CEC 15నిమిషాలు సమయం కేటాయించగా, 30 నిమిషాల పాటు విపులంగా తమ ఫిర్యాదు అంశాలను CECకి చంద్రబాబు, పవన్ వివరించార…అనంతరం చంద్రబాబు, పవన్ మీడియాతో మాట్లాడారు..
చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా వైసీపీ ప్రభుత్వం ప్రజస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు..ప్రతిపక్ష పార్టీలు,, నాయకులే లక్ష్యంగా దాదాపు 7 వేల కేసులు నమోదు చేయించి వేదిస్తోందని,, వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారన్నారు..వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎలక్షన్ డ్యూటీలకు దూరంగా ఉంచి,,టీచర్లు,,ప్రభుత్వ ఉద్యోగలతోనే ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ ను కోరినట్లు చంద్రబాబు చెప్పారు..రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వుండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎలక్షన్ కమిషనర్ గా ఉంటే ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయన్నారు..ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు..దొంగ ఓట్లపై సాక్ష్యాలతో సీఈసీకి వివరించామని,,మా ఫిర్యాదుల పట్ల ఈసీ సానుకూలంగా స్పందించిందని చంద్రబాబు అన్నారు..
ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించింది-పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవటంవల్లే విజయవాడకు రావడం జరిగిందన్నారు…వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిందని CECకి తెలియజేశామని పవన్ చెప్పారు..జనసేన, టీడీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడాన్ని,, బైండోవర్ కేసులు నమోదు చేయడాన్ని CEC దృష్టికి తీసుకెళ్లామన్నారు..వైసీపీకి అనుకూలంగా వున్న పోలీసు అధికారులను ప్రస్తుతం బదలీలు చేసి,,ఎన్నికల నోటిఫికేషన్ సమయానికి వాళ్లు కీలక విధుల్లో చేర్పించే విధంగా వ్యవహరిస్తున్న విషయంను CECకి స్పష్టంగా తెలియ చేయడం జరిగిందన్నారు..వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని,, ఎన్నికల విధులకు దూరంగా వుంచాలని కోరినట్లు విజ్ఞప్తి చేశామన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ను కోరడం జరిగిందని పవన్ చెప్పారు..మా విజ్ఞప్తులపై ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించిందని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చరని పవన్ తెలిపారు..కచ్చితంగా ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరుగుతాయని, ప్రభుత్వం మారుతుందని పవన్ వ్యాఖ్యనించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *