AMARAVATHISPORTS

26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రధానం చేసిన రాష్ట్రపతి

అమరావతి: ఆసియా క్రీడల్లో పసిడి పతకంతో కైవసం చేసుకున్న తెలంగాణ షూటర్ ఇషా సింగ్ తో పాటు 2023కు సంవత్సరానికి సంబంధించి 26 మంది క్రీడాకారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు స్వీకరించారు..భారత క్రికెట్ టీమ్ సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ ప్రతిష్థాత్మక అర్జున అవార్డులు అందుకున్న వారిలో వున్నారు..మంగళవారం భారత క్రీడా రంగంలో ఖేల్ రత్న అవార్డు తర్వాత రెండో అత్యుత్తన్నత అవార్డు అందుకున్న షమీ తన కల నిజమైందని అన్నాడు..జీవితంలో చాలామందికి ఈ అవార్డు గెలవడం సాధ్యం కాదు..ఈ అవార్డుకు నన్ను నామినేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని షమీ తెలిపాడు..
అర్జున అవార్డు అందుకున్నవిజేతలు:-

పారా ఆర్చరీ – శీతల్ దేవి.
హాకీ – కృష్ణన్ బహూదర్ పాఠక్, పుఖ్రంబం సుహిలా చాను.
కబడ్డీ – పవన్ కుమార్, రీతు నేగీ.
ఆర్చరీ – అదితి గోపిచంద్ స్వామి, ఒజాస్ ప్రవీణ్ డియోటలే.
అథ్లెటిక్స్ – పరుల్ చౌదరీ, శ్రీశంకర్ మురళి.
బాక్సింగ్ – మహ్మద్ హుసాముద్దీన్.
చెస్ – ఆర్ వైశాలి.
రెజ్లింగ్ – సునీల్ కుమార్, అంతిమ్ పంగల్.
ఈక్వెస్ట్రియన్ – అనుష్ అగర్వాల.
ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్ – దివ్యక్రితి సింగ్.
గోల్ఫ్ – దిక్షా దగర్.
ఖో ఖో – నస్రీన్.
లాన్ బౌల్స్ – పింకీ
క్రికెట్ – మహ్మద్ షమీ.
షూటింగ్ – ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్. ఈషా సింగ్
స్క్వాష్ – హరీందర్ పాల్ సింగ్ సాధు.
టేబుల్ టెన్నిస్ – ఆహికా పంగల్.
వుషూ – నవోరెమ్ రోషిబిన దేవి.
అంధుల క్రికెట్ – ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి.
పారా కనోయింగ్ – ప్రచీ యాదవ్ లు వున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *