AMARAVATHIEDUCATION JOBSHYDERABAD

తెలంగాణలో 10th పేపర్ లీక్-ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నాపత్రాల లీకేజ్ సమస్య వీడటం లేదు..TSPSC పేపర్ లీకేజీ విషయం ముగిసిపోక ముందే నేడు 10th ప్రశ్నా తెలుగు ప్ర‌శ్నాప‌త్రం లీకేజ్ కలకలం రేపుతోంది..సోమవారం ఉదయం వికారాబాద్‌లో జిల్లాలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు..పరీక్ష మొదలైన 7 నిమిషాల వ్యవధిలోనే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది..ఉదయం 9.37 నిమిషాలకు పేపర్‌‌ను ఫొటో తీసి వాట్సాప్ ద్వారా లీక్ చేసినట్లు తెలుస్తోంది..సోమవారం ఉదయం 9.30కు పరీక్ష ప్రారంభం కాగా కేవలం ఏడు నిమిషాల వ్యవధిలో పేపర్ లీక్ కావడంతో అంతా బిత్తపోయారు.. లీక్‌పై ఆరా తీస్తే ఓ టీచర్ దీన్ని లీక్ చేసినట్టు తేల్చారు…వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బంద్యప్ప ఈ పేపర్ లీక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత..పేపర్‌ లీకేజ్‌ విషయంలో బాధ్యులైన నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రశ్నాపత్రం బయటకు రావడానికి కారణమైన.ఇద్దరు ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పలతో పాటు విద్యాశాఖకు చెందిన గోపాల్, శివ కుమార్‌లను సస్పెన్షన్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. గది ఇన్విజిలేటర్ శ్రీనివాస్ ను ఇన్విజిలేషన్ విధుల్లో నుంచి తొలగింపు, బందేప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసులు నమోదు, ఇన్విజిలేటర్ శ్రీనివాస్ పాత్ర పై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించారు..ఈ క‌థ‌నాల‌పై రాష్ట్ర పాఠ‌శాల విద్యాశాఖ స్పందించింది. రేప‌టి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష వాయిదా ప‌డ‌లేద‌ని పాఠ‌శాల విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది. విద్యార్థులు, త‌ల్లిదండ్రులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలిపింది. రేప‌ట్నుంచి ఈ నెల 13వ తేదీ వ‌ర‌కు అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *