AMARAVATHIPOLITICS

ఈ నెల 28న పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తాం-టీడీపీ,జనసేన

అమరావతి: రెండు పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 28న తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహిస్తామని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,,జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు ప్రకటించారు..త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ జనసేన పార్టీలు గురువారం ‘సమన్వయ కమిటీ సమావేశం’ నిర్వహించాయి..ఈ సమావేశంలో రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపాయి..ఇందులో పొత్తును స్వాగతించిన టీడీపీ-జనసేన కేడర్‌ను అభినందిస్తూ ఒక తీర్మానం కాగా మీడియాపై దాడులను తప్పుపడుతూ రెండవ తీర్మానాన్ని సమన్వయ కమిటీ ఆమోదించింది..

ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని, త్వరలో విడుదల చేస్తామన్నారు.ఏయే స్థానాల్లో ఏయే పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు-జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.. క్షేత్ర స్థాయిలో టీడీపీ – జనసేనల మధ్య గ్యాప్ లేకుండా పని చేయాలని ఇరుపార్టీల కేడర్‌కు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.. టీడీపీ- జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు..అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారని,, ఏపీలో స్వేచ్ఛ లేకుండా పోయిందని మండిపడ్డారు.. రాష్ట్ర శ్రేయస్సు కోసం సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రాకూడదనే ఏకైక లక్ష్యంతో పొత్తు పెట్టుకున్నామని, తాడేపల్లి గూడెంలో జరిగే ఉమ్మడి సభకు 6 లక్షల మంది వస్తారనే అంచనాతో సభకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు..

నాదెండ్ల మనోహర్– ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే ఉద్దేశ్యంతో పొత్తులు పెట్టుకున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.. సమన్వయం లోపం లేకుండా రెండు పార్టీలు ఎన్నికలు వెళ్లబోతున్నాయని అన్నారు..టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పని చేయాల్సి ఉంటుందని,, అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు-పవన్ సూచిస్తున్నారని ప్రస్తావించారు..ఈ నెల 28వ తేదీన జరిగే సభ ఉమ్మడి సభలో రెండు పార్టీల నేతలు పాల్గొంటారని,, ‘బై బై వైసీపీ’ అనేది ఓ నినాదంగా మారాలని కేడర్‌కు సూచించారు.. రెండు నెలల్లో వైసీపీ విముక్త రాష్ట్రంగా మారుతుందని నాదెండ్ల మనోహర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *