AMARAVATHITECHNOLOGY

శనివారం ఉదయం సూర్యుని వైపు ప్రయాణానికి అదిత్య L-1 సిద్దం-ఇస్రో

అమరావతి: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో,,రెట్టించిన ఉత్సహాంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సూర్యుడికి సంబంధించిన వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు Aditya L-1 ప్రయోగానికి సంబంధించిన సాంకేతిక పరమైన అంతర్గత తనిఖీలు పూర్తయ్యాయని ఇస్రో బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది..శనివారం ఉదయం 11.50 గంటలకు సతీష్ థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది..కొరినాగ్రఫీ పరికరం సాయంతో సౌరవాతావరణాన్నిలోతుగా పరిశీలించి పరిశోధించడమే ఆదిత్య ప్రాజెక్టు ముఖ్యొద్దేశం అని అధికారులు వెల్లడించారు.. భూమి నుంచి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్ రేంజ్ కక్ష్యలో ఈ శాటిలైట్ ను ప్రవేశపెట్టనున్నారు.. Aditya L-1 ను దేశంలో వివిధ జాతీయ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో తయారు చేసినట్లు ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. Aditya L-1 ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్న శాటిలైట్ బరువు దాదాపు 1500 Kg బరువుతో ఉంటుంది. Aditya L-1 లో మొత్తం 7 పేలోడ్లు అమర్చారు..సూర్యుని నుంచి ప్రసరించే అత్యంత శక్తివంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు అనుగుణంగా ఈ ప్రోగ్రామ్ ను రూపొందించినట్లు ఇస్రో అధికార వర్గాలు వెల్లడించాయి.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *