DISTRICTS

ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి-కలెక్టర్

నెల్లూరు:  జిల్లాలో  ఈనెల 13న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో  పోలింగ్ స్టేషన్ వద్ద గుర్తింపు కోసం ఓటర్లందరూ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు కార్డు లేదా 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ ఛక్రధర్ బాబు కోరారు.ఈ దిగువ  పేర్కొన్న 12 ప్రత్యామ్నాయ  ఫోటో గుర్తింపు కార్డులు:-  

(i)ఆధార్ కార్డు,,,(ii) ఎంఎన్ఆర్ఇజిఎ జాబ్  కార్డు,,,(iii) బ్యాంక్/ పోస్ట్ ఆఫీసు జారీచేసిన ఫోటో గ్రాఫ్ తో పాస్ పుస్తకాలు,,,(iv) కార్మిక మంత్రిత్వ శాఖ పధకం కింద జారీ  అయిన  ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు,,,(v) డ్రైవింగ్ లైసెన్స్,,,(vi) పాన్ కార్డు,,,(vii) ఎన్ పి ఆర్  కింద ఆర్.జి.ఇ చే జారీ చేయబడిన స్మార్ట్ కార్డు,,,(viii) భారతీయ పాస్ పోర్ట్,,,(ix) ఫోటో గ్రాఫ్ వున్న పింఛను డాక్యుమెంట్,,,(x) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ /పి.ఎస్.యు లు/ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు జారీ చేసిన ఫోటోగ్రాఫ్ తో సర్వీసు ఐడింటిటి కార్డులు,,,(xi) ఎంపి/ ఎంఎల్ఏ/ ఎంఎల్.సి లకు జారీ చేసిన అధికార గుర్తింపు కార్డులు,,,(xii) భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన ప్రత్యేక అశక్తత గుర్తింపు కార్డు (యూనిక్ డిజిబిలిటీ ఐడి).

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *