AMARAVATHI

హైదరాబాద్ కేంద్రాగానే ఢిల్లీ లిక్కర్ స్కాం వాటాల పంపకం-ఈడీ

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో, ఆప్ లీడర్ మనీష్ సిసోడియాను శుక్రవారం (మార్చి 10వ తేదీ)  విచారించిన అనంతరం ఆయన రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు ఈడీ రిపోర్ట్ ద్వారా బయటపడ్డాయి..ఢిల్లీ లిక్కర్ స్కాం మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని,,ఐటీసీ కోహినూర్ హోటల్ లోనే చర్చలు జరిగాయని రిపోర్టులో ఈడీ స్పష్టం చేసింది.. దినేష్ అరోరాను హైదరాబాద్ పిలిపించిన సౌత్ గ్రూప్ సభ్యులు, హోటల్ కేంద్రంగా సమాలోచనలు చేసినట్లు వెల్లడించింది.. చర్చల సమయంలో విజయ్ నాయర్, అర్జున్ పాండే, అభిషేక్, ఆడిటర్ బుచ్చిబాబు అందరూ కలిసే ఉన్నారని,,దాదాపు 8 గంటలపాటు వీరి మీటింగ్ జరిగిందని సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.. హైదరాబాద్ కేంద్రంగా సాగిన లిక్కర్ స్కాంలో,, సౌత్ గ్రూప్ నుంచి ఆప్ పార్టీకి 100 కోట్ల రూపాయల ముడుపులు ముట్టినట్లు ఈడీ తేల్చింది..ఎమ్మెల్సీ కవిత తరపున అరుణ్ పిళ్లయ్ ప్రాతినిధ్యం వహించారని,,ఇండో స్పిరిట్ కంపెనీలో 65 శాతం వాటా సౌత్ గ్రూప్ దే అని ఈడీ అధికారులు రిపోర్టు ద్వారా కోర్టుకు సమర్పించారు..సౌత్ గ్రూప్ లో కవిత భాగస్వామిగా ఉన్నారని ఆమె పేరును ప్రస్తావించారు..సౌత్ గ్రూప్ సిండికేట్ లో మాగుంట రాఘవరెడ్డి, విజయ్ నాయర్, బుచ్చిబాబుతోపాటు కల్వకుంట్ల కవిత ఉన్నారని మొదటిసారి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. లిక్కర్ పాలసీ ద్వారా వచ్చే లాభాల్లో 6 శాతం సౌత్ గ్రూప్ కు.. 6 శాతం ఆప్ పార్టీకి పంచుకుంటూ, ఈ డీల్ జరిగిందని సిసోడియా విచారణ తర్వాత ఈడీ వెల్లడించింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *