AMARAVATHINATIONAL

ఈనెల 13న 9వ P-20 సమావేశాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అమరావతి: ఈనెల 13వ తేదిన ఢిల్లీలో 9వ P-20 సమావేశాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.. G-20 శిఖరాగ్ర సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్లాలి అనే ఆంశంపై చర్చించేందుకు G-20 దేశాలకు సంబంధించిన పార్లమెంట్ వ్యవస్థలను ఒక వేదికపైకి తీసుకొచ్చి నిర్వహించేవే P-20 సమావేశాలు..
G-20 లోని 20 సభ్య దేశాలతో పాటు,, 10 ఇతర దేశాలు (ప్రత్యేక ఆహ్వానిత దేశాలు), అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు P20 సమ్మిట్ లో పాల్గొంటారు..మొదటిసారిగా భారత్ లో జరుగుతున్న ఈ P-20 సమావేశాల్లో ఆఫ్రికన్ పార్లమెంట్ అధ్యక్షుడు కూడా పాల్గొననున్నారు..ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ద్వారకలో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ ను ‘యశోభూమి’ పేరుతో ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు..ఆ ‘యశోభూమి’ P-20 సదస్సుకు వేదిక కానున్నది..ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ‘యశోభూమి’ని సందర్శించి, సన్నాహాలను సమీక్షించారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర చర్చల్లో 4 అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు లోకసభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు..
1- సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం ఎజెండా 2030: విజయాలను ప్రదర్శించడం, పురోగతిని వేగవంతం చేయడం
2-సస్టైనబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్: గ్రీన్ ఫ్యూచర్ కి గేట్ వే,,3-లింగ సమానత్వం: మహిళా సాధికారత – మహిళల నేతృత్వంలోని అభివృద్ధి,,4-పబ్లిక్ డిజిటల్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా ప్రజల జీవితాలను మార్చడం.
వీటిపై చర్చించడంతో పాటు P-20 సమ్మిట్ లో ఉమ్మడి ప్రకటన కూడా తీసుకురానున్నారు..దీని ద్వారా ప్రపంచ దేశాలన్నింటికీ సమానత్వం, సౌభ్రాతృత్వం, ఐక్యత సందేశాన్ని అందించే ప్రయత్నం చేయనున్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *