AMARAVATHI

సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను-ఎంపీ అవినాష్ రెడ్డి

వివేకానందరెడ్డి హత్యకేసులో..

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి CBI ఎదుట రెండోసారి హాజరయ్యారు..శుక్రవారం దాదాపు 4.30 గంటలపాటు సీబీఐ అధికారులు ఎంపీని ప్రశ్నించారు..ఈ విచారణలో అధికారులు గ్యాప్ లేకుండా అడిగిన ప్రశ్నలకు అవినాష్ ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని తెలుస్తోంది..సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ఆఫీసు నుంచి బయటికొచ్చిన అవినాష్ మీడియా వ్యవహరిస్తూన్న తీరు దారుణంగా వుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ,, సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాను..విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోరాను..టేబులపైన ల్యాప్ టాప్ మాత్రమే వుంది..వాళ్లు రికార్డ్ చేశారో లేదొ తెలియదు.. మీడియా బాధ్యతగా వ్యవహరించాలి.. విచారణలో ఉండగానే వార్తలను ప్రచారం చేస్తున్నారు..దోషులు, నిర్దోషులను మీరే నిర్ణయిస్తున్నారు.. వాస్తవాలు బయటకు రావాలంటే సంయమనం పాటించాలి..అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది..అది గూగుల్ టేకౌటా?.. టీడీపీ టేకౌటా?..అనేది విచారణలో తెలుస్తుంది…పర్సన్ టార్గెట్గా విచారణ కొనసాగుతోంది..ఇది కరెక్ట్ కాదు.. సీబీఐ కేసులో అధికారి అయిన ఐవో, సీబీఐ డైరెక్టర్‌కు ఒక వినతి పత్రం ఇచ్చాను..మీడియాలో వస్తున్న కథనాలతో సీబీఐ విచారణపై ప్రభావం పడుతుంది..ఒక నిజాన్ని 100 నుంచి సున్నాకు తెచ్చే ప్రయత్నం జరుగుతోంది..ఒక అబద్ధాన్ని సున్నా నుంచి 100కు పెంచే ప్రయత్నం జరుగుతోంది..విచారణ వాస్తవాల ఆధారంగా జరగడం లేదు.. ఏకపక్షంగా సీబీఐ విచారణ జరుగుతోంది..హత్య జరిగిన రోజు నేను ఏం మాట్లాడానో.. ఈరోజు అదే మాట్లాడుతున్నా.. నాకు తెలిసింది అదే..మళ్లీ విచారణకు రావాలని సీబీఐ ఏం చెప్పలేదు అని మీడియాకు అవినాష్ రెడ్డి వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *