NATIONAL

రాష్ట్రాలు అంగీకరిస్తే, పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు సిద్ధం-ఆర్దిక మంత్రి

అమరావతి: అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే, పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధంగా వున్నమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు..బుధవారం పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (PHDCCI)తో సమావేశమైన సందర్బంలో అర్ధిక మంత్రి మాట్లాడుతూ ఈ విషయంలో GST మండలిలో చర్చకు ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని తెలిపారు..భారతదేశ ఆర్థిక వృద్ధి ఇలాగే కొనసాగాలని, ఏ మాత్రం తగ్గకూడదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు..మూల ధన వ్యయానికి వరుసగా గత మూడు-నాలుగు సంవత్సరాల నుంచి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు..దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వనరులపైన దృష్టి పెట్టామని అన్నారు.. విద్యుత్ తో సహా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలని,, వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నామని నిర్మలమ్మ చెప్పారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *