AMARAVATHIINTERNATIONAL

మాల్దీవుల హై కమిషనర్ కు సమన్లు జారీచేసిన భారత్

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్రమోదీపై మాల్దీవుల మంత్రుల చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో మాల్దీవుల రాయబారికి భారత్ సమన్లు జారీచేసింది..నేడు (సోమవారం) ఢిల్లీలోని మాల్దీవుల హై కమిషనర్ ఇబ్రహిం శహీబ్ సౌత్ బ్లాక్ లోని విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయానికి వెళ్లగా,,జరిగిన సంఘటనపై వివరణ ఇవ్వాలని భారత్ స్పష్టం చేసింది..ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ మాల్దీవుల మంత్రులు సామాజిక మాధ్యమాల్లో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నది.. దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో అక్కడి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది..భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై తమ మంత్రులు,, అధికారులు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటన విడుదల చేసింది..సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు మాల్షా షరీఫ్, మరియం షువానా, అబ్దుల్లా మాజిద్, ప్రభుత్వ అధికారుల్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.. తమ ఎంపీలు భారత్ పై అక్కసు వెళ్లగక్కడం ఆమోదనీయం కాదని,, ఆ వ్యాఖ్యలు తమ ప్రభుత్వ,, ప్రజల వైఖరిని ప్రతిబింబించవని మాల్దీవుల విదేశాంఖ శాఖ తెలిపింది..
ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల లక్షద్వీప్ లో పర్యటించి,, అక్కడి సముద్రంలో స్నార్కెలింగ్ చేశారు..సాహసాలు చేయాలనుకునేవారు, తమ లిస్టులో లక్షద్వీప్ ను చేర్చుకోవాలని సూచిస్తూ ఫొటోలను షేర్ చేశారు..ఈ పోస్ట్ పై మాల్దీవుల మంత్రులు అభ్యంతర వ్యాఖ్యలు చేశారు..ప్రధానిని ఇజ్రాయెల్ పప్పెట్ గా అభివర్ణిస్తూ ఓ మంత్రి దుర్భాషలు చేయగా,, భారత్ ను ఆవు పేడతో పోల్చారు.. మరో ఇద్దరు మంత్రులు కూడా ఇదే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *