NATIONAL

ఎన్నో ఆడ్డంకులను దాటుకుంటూ భారత్‌ అజాద్ కీ అమృతోత్సవ కాలంకు చేరుకుంది-ప్రధాని మోదీ

అమరావతి: లక్షల మంది త్యాగధనుల పోరాటంతో సాధించుకున్న స్వాతంత్ర్యం,,అనంతర కాలంలో దేశ ప్రజలు స్వేఛ్చవాయువులతో అభివృద్ది దిశగా నడక ప్రారంభించారని  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు..అదివారం మధ్యాహ్నం నూతన లోకసభ ప్రాంగణంలో సభ్యులను,దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.. ఎన్నో ఆడ్డంకులను దాటుకుంటూ భారత్‌ అజాద్ కీ అమృతోత్సవ కాలంకు చేరుకుందన్నారు.. అమృతోత్సవ వేళ దేశం మరింత పురోభివృద్ధి దిశగా పయనించాలని అక్షాంక్షించారు.. అమృతోత్సవ కాలం దేశానికి కొత్త మార్గాన్ని సూచిస్తుందని,,ప్రజల ఆశలు, ఆకాంక్షలు, కలలను సాకారం చేసుకోవాలన్నారు..ముక్త భారత్‌ కోసం నవీన పంథా కావాలని,,నూతన పార్లమెంట్ ప్రాగంణంలొ తీసుకునే నిర్ణయలు భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తాయన్నారు..ప్రపంచ యవనికలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు..21వ శతాబ్దపు నూతన భారతదేశం ఉన్నత స్ఫూర్తితో బానిసత్వ ఆలోచనను వదిలివేస్తోందన్నారు..పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు..

ప్రతి భారతీయుడు గర్వపడేలా నిర్మాణం:- ఈరోజు కొత్త పార్లమెంటు భవనాన్ని చూసి ప్రతి భారతీయుడు గర్వంతో  పొంగిపోతారన్నారు..ఇందులో వాస్తుశిల్పం, వారసత్వం, కళ, నైపుణ్యం, సంస్కృతి, రాజ్యాంగం కూడా ఉన్నాయన్నారు.. లోక్‌సభ లోపలి భాగం జాతీయ పక్షి నెమలిపై, రాజ్యసభ లోపలి భాగం జాతీయ పుష్ప కమలంపై నమూనలో ఉంటుందని,,.పార్లమెంట్ ఆవరణలో జాతీయ వృక్షం మర్రి చెట్టు కూడా ఉందన్నారు..

బానిసత్వ ఆలోచనను వదిలి:- 21వ శతాబ్దంలో భారత్‌ ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుంది. దేశం బానిస వాసనలను వదిలిపెట్టి ముందుకెళ్తోంది. పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు ప్రధాని మోదీ.

లోక్‌సభలో పవిత్ర సెంగోల్‌:- కొత్త పార్లమెంటు లోక్‌సభలో పవిత్ర సెంగోల్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. పవిత్ర సెంగోల్ కు గౌరవం తిరిగి లభించిందన్నారు..సాధువుల ఆశీస్సులతోనే మనం పవిత్ర సెంగోల్‌కు దాని గౌరవాన్ని తిరిగి ఇవ్వగలిగామని ప్రధాని మోదీ అన్నారు.. ప్రజాస్వామ్యం మనకు ఒక ఆలోచన, ఒక సంప్రదాయం, భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి, పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం అన్నా ప్రధాని మోదీ..ఎక్కడైనా ఆగిపోతే అభివృద్ధి అక్కడే ఆగిపోతుందని,,స్వాతంత్య్రం అనంతరం ప్రారంభించిన నడక అగిపోకుండా ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తూనే ఉండాలన్నారు..

విడుదలైన రూ.75 నాణెం:- కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం అనంతరం రూ. 75 నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు.. అలాగే కొత్త తపాలా స్టాంపును ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ సహా ఇతర నేతలు విడుదల చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *