AMARAVATHICRIME

ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్

అమరావతి: అమృత్‌పాల్ సింగ్,ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ ను పోలీసులు అదివారం అరెస్ట్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు..ఇతను మార్చి 18 నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు..పంజాబ్‌లోని మోగాలో అమృతపాల్ సింగ్‌ ను ఉదయం 6.45 గంటలకు అరెస్టు చేశామని తెలుపుతూ పోలీసులు ట్వీట్ చేశారు.. అమృత్‌సర్ పోలీసులు,పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయని, పవిత్రతను కాపాడుకోవడానికి పోలీసులు గురుద్వారా సాహిబ్‌లోకి ప్రవేశించలేదని తెలిపారు..ఇప్పటికే అమృత్ పాల్ సింగ్ కేసులో పంజాబ్ పోలీసులు 207 మందిని అరెస్ట్ చేశారు..అమృత్ పాల్ ను అదుపులోకి తీసకున్న పోలీసులు,, అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించనున్నట్టు తెలుస్తోంది..

(అమృత్ పాల్‌కు అత్యంత సన్నిహితుడైన లవ్‌ప్రీత్‌ సింగ్‌ అలియాస్‌ తూఫాన్‌ సింగ్‌ను ఫిబ్రవరిలో పంజాబ్‌ పోలీసులు ఓ కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేశారు..సదరు అరెస్టును వ్యతిరేకిస్తూ అమృత్‌పాల్‌ అనుచరులు పెద్ద సంఖ్యలో అమృత్‌సర్‌ జిల్లాలోని అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడికి ప్రయత్నించారు..ఈ క్రమంలో అల్లర్లు జరిగేలా యువతను రెచ్చగొట్టాడన్న ఆరోపణలపై అమృత్‌పాల్‌పై అప్పట్లో కేసు నమోదైంది..అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు).

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *