AMARAVATHIDISTRICTSPOLITICS

వైసీపీ విముక్త ఉత్తరాంధ్ర లక్ష్యంగా పనిచేద్దాం-వలసలు నివారించడమే నా లక్ష్యం-పవన్

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో వలసలు నివారించడమే తన లక్ష్యమని,,యువతకు ఉఫాధికల్పించేందుకు తన వంతు కృష్టి చేస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు..గురువార విశాఖపట్నంలో రాజా గ్రౌండ్స్ లో నిర్వహించిన బహిరంగ సభలో అయన మాట్లాడుతూ సీ.ఎం,సీ.ఎం అంటూ యువకులు నినాదలు చేస్తున్నరని,,మీ గుండెల్లో వున్న అభిమానం ఓట్ల రూపంలో మారితే మీ కొరిక తప్పక నెరవేరుతుందని చెప్పారు..

సీ.ఎం అనే విషయం తాను చంద్రబాబు కలసి నిర్ణయించుకుంటామన్నారు.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల ఆత్మగౌరవం.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని కేంద్రం పెద్దలతో మాట్లాడాను.. నేను ఓట్లు కోసం రాలేదు..మార్పు కోసం వచ్చాను.. ఉత్తరాంధ్ర నాకు ఇష్టమైన ప్రాంతం..నేను భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను.. దశాబ్ద కాలం ఓటమి,,అవమానలను తట్టుకుని ముందుకు వెళ్తున్నా.. ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండేలా కృషి చేస్తాను.. నేను బీజేపీలో జాయిన్ అయితే నాకు కోరుకున్న పదవి ఇస్తారు.. రాజధానికి దారేది ? ఈరోజుకు ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు..

ప్రతీ 30 కిలోమీటర్లకు మత్స్యకారులకు జెట్టీలు ఉండాలి.. ఉత్తరాంధ్ర బీసీలకు తెలంగాణలో గుర్తింపు లేదు.. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కృషి చేస్తున్నాం..నేను జనసేన పార్టీని మరొక పార్టీలో ఎప్పుడూ విలీనం చేయను..

2014లో రాష్ట్రానికి మంచి జరుగుతుందని టీడీపీ-బీజేపీతో పొత్తుతో ముందుకు వెళ్ళాం..అ రోజు నేను ఎలాంటి పదవులు ఆశించలేదు.. 2024లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారుమయం చేయాలి.. జనసేన.. తెలుగుదేశం పార్టీ వెనుక నడవడం లేదు..కలిసి ముందుకు వెళ్తున్నాం..ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పొత్తు ఒక్కటే మార్గం” అని తేల్చి చెప్పారు.మరో 3 నెలల్లో వైసీపీ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్సిస్తామంటూ 3 వేళ్లు చూపించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *