AMARAVATHIPOLITICS

కాంగ్రెస్ కు మొండి చెయ్యి చూపించిన మమతా బెనర్జీ

సోది కబుర్లు చెప్పిన జైరాం…

అమరావతి: బీజెపీని దెబ్బతిసేందుకు,,విపక్షల కూటమి (I.N.D.I.A.) భాగస్వామిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ,,కాంగ్రెస్ ను సొదిలో కూడా తీసుకోకుండా, ఏకపక్షంగా 42 లోక్‌సభ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది..కూటమి ఏర్పాటు అయ్యేందుకు తొలి అడుగు వేసిన బీహార్ సీ.ఎం నితీష్ కుమార్,, (I.N.D.I.A.)కు బై బై చెపుతూ,బీజెపీతో కలసి పోయారు..దింతో ఆత్మరక్షణలో పడిని కాంగ్రెస్,,పరువు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది..మిగిలిన విపక్ష పార్టీతో బేరసారాలకు దిగింది..ఈ నేపధ్యంలో బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ తో జట్టు కడతామని అయితే తమకు 8 నుంచి 10 లోకసభ స్థానలు ఇవ్వలంటూ డిమాండ్ చేసింది..కాంగ్రెస్ బలం ఎంతో తెలిసిన మమతా,2 లేక 3 సీట్లు ఇస్తానంటూ ప్రతిపాదించింది.. ఇందుకు కాంగ్రెస బెట్లు చూపడంతో,,అదివారం మమతా బెనర్జీ బెంగాల్ లోని 42 స్థానాలకు తమ పార్టీ అభ్యర్దులను ప్రకటించి,,కాంగ్రెస్ కు మొండి చెయ్యి చూపించింది.. (I.N.D.I.A.)కూటమిలో తమ పరువు మంట కలసి పోవడంతో,,దిక్కు తోచన కాంగ్రెస్ తనదైన శైలిలో సోది కబుర్లు చెప్పడం ప్రారంభించింది..సోది చెప్పెందుకు మీడియా ముందుకు వచ్చిన కాంగ్రెస పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ట్వీట్టర్ వేదికగా పోస్టు చేస్తూ,,, ఏ ఒత్తిడి కారణంగా టీఎంసీ ఈ నిర్ణయం తీసుకుందో తమకు తెలియదని పేర్కొన్నారు..

”ఎలాంటి ఒప్పందమైనా సంప్రదింపుల ద్వారా, గౌరవప్రదంగా ఖరారు కావాలని, ఏకపక్షంగా ఉండరాదని కాంగ్రెస్ పార్టీ మొదట్నించీ చెబుతోందని,,బీజేపీతో ఇండియా కూటమి సమష్టిగా పోరాటం చేయాలనేది కాంగ్రెస్ కోరుకుంటోందని ముక్తాయింపు ఇచ్చారు..ఏం జరుగుతుందో చూద్దాం అని జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *