AMARAVATHICRIMEHYDERABAD

హైదరాబాద్లో మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన NIA

హైదరాబాద్: హైదరాబాద్లో మరో ఉగ్రవాదిని అరెస్ట్ చేయడంతో కలకలం రేపుతుంది..గతంలో మధ్యప్రదేశ్ తెలంగాణ పోలీసులు జరిపిన సోదాల్లో హైదరాబాదులో ఆరుగురు అరెస్ట్ అయితే వాళ్లతో సంబంధం ఉన్న మరొక వ్యక్తిని NIA (జాతీయ దర్యాప్తు సంస్థ) అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు..HUT అనే ఉగ్రవాద సంస్థకు చెందిన 6 మందిని హైదరాబాదులో గతంలో మధ్యప్రదేశ్ ATS పోలీసులు అరెస్ట్ చేశారు..పిదప ఆ కేసు NIAకి బదిలీ అయింది..జాతీయ దర్యాప్తు సంస్థ ఈ కేసుని వేగంగా దర్యాప్తు చేస్తొంది..ఈ కేసులో హట్ తో సంబంధం ఉన్న అనేక మంది వ్యక్తులను అరెస్ట్ చేసింది..నేడు హైదరాబాదులో అరెస్ట్ అయిన సల్మాన్,, రాజేంద్రనగర్ లో తలదాచుకుని ఉండగా NIA అధికారులు వలపన్ని పట్టుకున్నారు..అనంతరం సల్మాన్ కు చెందిన రెండు ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు..హట్ ద్వారా సల్మాన్,,యువకులను ఉగ్రకార్యకలపాలకోసం రిక్రూట్ మెంట్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు..సల్మాన్ ఇంటి నుంచి కీలక పత్రాలతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *