AMARAVATHINATIONAL

నెల 13న ‘చలో ఢిల్లీ’ హై అలర్ట్‌ ప్రకటించిన ఢిల్లీలో పోలీసులు

అమరావతి: సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు ఈ నెల 13న ‘చలో ఢిల్లీ’ ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హర్యానా, ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి రావద్దని హర్యానా పోలీసులు హెచ్చరించారు.. అంబాల, సోనిపట్‌, పంచకుల్‌లో సెక్షన్‌ 144 విధించారు. 50 కంపెనీల కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచారు.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు.. పంజాబ్‌, హర్యానా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్‌లు, కంటెయినర్‌లను సిద్ధం చేశారు.. ఒకవేళ రైతులు నగరంలోకి రావాలని ప్రయత్నిస్తే వాటితో సరిహద్దులను మూసివేస్తామని తెలిపారు.. ఈ నెల 13న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నదాతలు పిలుపునిచ్చారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *