AMARAVATHIPOLITICS

రాయలసీమ కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయింది-పవన్ కల్యాణ్

అమరావతి: చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం సాయంత్రం జనసేనలో చేరారు.. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానించారు.. ఈసందర్బంలో పార్టీ కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి అయన మాట్లాడుతూ “పార్టీలు మారినప్పుడుల్ల మాట మార్చేవారు నాకు అవసరం లేదు,,మాట మీద నిలబడే వారే నాతో వుంటారని కాపు సంఘ నాయకుడు ముద్రగడ పధ్మనాభం గురించి,జోగయ్య గురించి పరోక్షంగా ప్రస్తవించారు.. ‘మొన్నటిదాకా నాకు అలా చేయ్, ఇలా చేయ్ అని చాలా మంది సలహాలు ఇచ్చారు.. నాకు సీట్లు తీసుకోవడం, ఇవ్వడం తెలియదా? నాకు సలహాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారు.. కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి.” అంటూ పవన్ కల్యాణ్ చురకలు వేశారు..

రాయలసీమతో నాకిదే సమస్య. తొడగొట్టడాలు నాకు తెలీదు. మీరు కొడితేనే రక్తం వస్తుందా..? మేం కొడితే రక్తం రాదా..? మేం కొడితే కాళ్లు.. కీళ్లు విరగవా..? ఆరణి శ్రీనివాస్ నాకు 2008 నుంచి పరిచయం.. కొద్దిపాటి ఓట్ల తేడాతో 2009లో ఆరణి ఓడించబడ్డారు.. ఏమీ ఆశించకుండా పార్టీలో పని చేయడానికి ఆరణి సిద్దపడ్డారు. చిత్తూరు జిల్లా ఓ ఐదుగురు చేతుల్లోనే ఉంది.. పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి మీద నాకేం శతృత్వం లేదు.. రాయలసీమ కొద్ది మంది చేతుల్లోనే బందీ అయిందనే బాధ నాకుంది..

2019లో నేను ఓడిపోయిన సమయంలో ప్రీతి తల్లి వచ్చి నన్ను కలిసింది.. తన లాంటి వారి కోసం నన్ను నిలబడాలని కోరింది..నన్ను కర్నూలు రావాలని ఆహ్వానించింది.. నేను కర్నూలు వెళితే లక్షన్నర మంది జనం వచ్చి సుగాలి ప్రీతి తల్లికి మద్దతు తెలిపారు.. జనసేన ఒత్తిడి కారణంగానే సుగాలి ప్రీతి కేసు సీబీఐకి ఇచ్చారు..రాయలసీమలో నిరసన తెలపాలని వస్తే మద్దతిస్తున్నారు… కానీ ఎన్నికల సమయంలో మాత్రం భయపడుతున్నారు… ఈ నేల పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డి ది కాదు.. రాయల వారు ఏలిన నేల రాయలసీమ…ఊర కుక్కలను కుందేలు తరిమిన నేల రాయలసీమ. అలాంటి ప్రాంతం కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయింది” అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *