AMARAVATHIDISTRICTS

ఈ నెల 20 నుంచి పెన్నా డెల్టాకు సాగు నీరు విడుదల-మంత్రి కాకాణి

నెల్లూరు: జిల్లాలో ప్రస్తుతం వున్న నీటి వనరుల లభ్యతను దృష్టిల్లో వుంచుకొని,ఈ రబీ సీజన్ లో పెన్నా డెల్టా క్రింద సుమారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు రాష్ట్రవ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు..మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ అధ్యక్షతన జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో మంత్రి  కాకాణి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.. జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల ఆయకట్టు కింద మొదటి పంటకు సాగునీరు అందించేందుకు మంగళవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా బోర్డు సమావేశంలో పెన్నా డెల్టా కింద వున్న సుమారు రెండు లక్షల నుంచి 2.2 లక్షల ఎకరాలకు సాగు నీటిని  కేటాయిస్తూ కమిటి తీర్మానించినట్లు తెలిపారు. నీటి లభ్యతను బట్టి నాన్ డెల్టా ప్రాంతానికి కూడా సాగు నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.. జిల్లాలో త్రాగునీటికి ఇబ్బంది లేకుండా సాగునీరు అందిస్తామన్నారు..ప్రస్తుతం వర్షా భావ పరిస్థితుల కారణంగా ఈ సీజన్లో రిజర్వాయర్లలో, చెరువుల్లో గాని వున్న నీటి లభ్యతను అంచనా వేసి త్రాగు నీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా వున్న నీటిని సమర్ధవంతంగా  వినియోగించుకుంటూ  రైతులకు అవసరమైన సాగు నీరు ఈ నెల 20వ తేదీ నుండి ఇచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

కలెక్టర్ హరినారాయణన్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో వ్యవసాయ, జల వనరుల శాఖలను సమన్వయం చేస్తూ  త్రాగునీటి అవసరాలను కూడా తీర్చుకుంటా సాగు నీటిని సమర్ధవంతంగా సద్వినియోగం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు..ఈ సమావేశంలో ఎమ్మేల్యేలు,ఎమ్మేల్సీలు,,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *