అవినాశ్‌ రెడ్డి ముంద‌స్తు బెయిల్‌పై జోక్యానికి నిరాక‌రించిన సుప్రీం కోర్టు

అమరావతి: వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి ముంద‌స్తు బెయిల్‌పై జోక్యానికి సుప్రీం నిరాక‌రించింది.. హైకోర్టు వెకేష‌న్ బెంచ్ ముందు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని సుప్రీంకోర్టు సూచించింది..25వ తేదిన హైకోర్టు వెకేష‌న్ బెంచ్ అవినాశ్ ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ జ‌ర‌పాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది..అంత‌వ‌ర‌కూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయ‌కుండా సీబీఐకి అదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాక‌రించింది..వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను వెకేషన్‌ బెంచ్‌ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది..తన తల్లికి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు వారం రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని కూడా అవినాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.. ‘వచ్చే నెల 6న తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ విచారణకు వచ్చేవరకు అరెస్టు చేయకుండా ఆదేశించండి..లేదంటే ఈ నెల 25న హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారించాలని ఆదేశించి అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులివ్వండి’ అని అభ్యర్థించారు.. ఈ హత్య కేసు దర్యాప్తును ట్రయల్‌ కోర్టు పర్యవేక్షించవచ్చా,,, లేదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌ను ఆయన దరఖాస్తుతో కోర్టు జత చేసింది..ఈ పిటీషన్లు కలిపి మంగళవారం జస్టిస్‌ జేకే మహేశ్వరి,, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతో కూడిన వెకేషన్‌ ధర్మాసనం ఎదుట 36వ విచారణ కేసుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *