AMARAVATHI

ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన ఎన్డీఏ కూటమి

అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని,,ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామని పవన్ కల్యాణ్ అన్నారు..ఏపీ భవిష్యత్తు కత్తి మొన మీద వేలాడుతోందని,,గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అశాంతి, అరాచకమే ఉందన్నారు..వైసీపీ, 10 రూపాయిలు ఇచ్చి 100 రూపాయిలు కొట్టేసిందని మండిపడ్డారు..ప్రతి కుటుంబంపై రూ. 8 లక్షల మేర అప్పు ఉందని,,అన్ని వర్గాలను నాశనం చేశారని,,విధ్వంస పాలన సాగనంపి, కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు..

మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని కాపాడేందుకే మేం సర్దుబాటు చేసుకున్నామన్నారు..20 లక్షల మంది యువతకు ఉపాధి,,నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి,,మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం,,మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,,తల్లికి వందనం ఒక్కో బిడ్డకు రూ.15 వేలు,,స్కిల్ గణన చేపడతాం,,ఎంఎస్ఎంఈలకు ప్రొత్సాహాకాలు,,10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేస్తాం,,సమగ్ర ఇసుక విధానం తెస్తాం,,ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు,,కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతామన్నారు..కూటమి అధికారం చేపట్టిన వెంటనే మెగా డీఎస్సీ మీదే తొలి సంతకం పెడతామని చంద్రబాబు తెలిపారు.

వృద్దాప్య పించన్లు రూ.4 వేలు ఇస్తామని,,అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించారు..అలాగే వికలాంగులకు రూ. 6 వేలు, పూర్తి వికలాంగులకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తామని కూటమి ప్రకటిచింది..బీసీ సబ్ ప్లాన్ ద్వారా వచ్చే 5 సంవత్సరాల్లో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడతామని,,బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లతో పాటు బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు..బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ.10 వేల కోట్లు,,ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు చేస్తామని తెలిపారు..పవర్ లూం, హ్యాండ్ లూములకు కొంత మేర ఉచిత విద్యుత్,,మత్స్యకారులను ఆదుకుంటామని వెల్లడించారు..డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపారు..సంపద సృష్టించి,,ఆదాయాన్ని పంచుతామన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *