AMARAVATHI

అంగన్ వాడీ కార్యకర్తల పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అప్రజాస్వామిక-పవన్

అమరావతి: 42 రోజుల నుంచి సమ్మె చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పట్ల ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యయుతంగా లేదని అభిప్రాయం వ్యక్తం చసిన పవన్ కళ్యాణ్,,ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా సోమవారం ఓ లేఖ విడుదల చేశారు..నామమాత్రపు వేతనాలతో పనిచేస్తున్న మహిళలతో సామరస్యపూర్వకంగా చర్చలు జరపకుండా,, విధుల నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, పోలీసు చర్యలకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు..ఇది పాలకుల ధోరణిని తెలియజేస్తోందని విమర్శించారు.. కోటి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి అందించేందుకు విజయవాడ వెళ్తున్న అంగన్ వాడీలను పోలీసులు ఈడ్చివేయడం, వాహనాల్లో ఎక్కించడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్ వాడీలను అరెస్టు చేయడంతో,, వారి కుటుంబాలకు ఆందోళన కలిగిస్తోందన్నారు.. అంగన్ వాడీ సిబ్బందిని అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాల్ని చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని కూడా ఖండిస్తున్నానన్నారు..
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన సమయంలో పొరుగు రాష్ట్రాల కంటే రూ.1000 జీతం ఎక్కువగా ఇస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారని,, దాన్నే అమలు చేయాలని అంగన్ వాడీ సిబ్బంది కోరుతోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు..సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యూటీ విధానాన్ని వర్తింపచేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు..వారి పట్ల జగన్ ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరించడం ఏమాత్రం తగదని అన్నారు.. చిన్నపాటి జీతాలతో పనిచేస్తున్న వారి పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచన చేయాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానని జనసేనాని ఆ లేఖలో పేర్కొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *