AMARAVATHIPOLITICS

చంద్రబాబుపై ఒత్తిడి వుంటుంది,అలాగే నాపై కూడా అలాంటి ఒత్తిడే వుంది-పవన్

అమరావతి: పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం ఉల్లంఘించిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు..మంగళగిరి జనసేన కార్యాయలంలో రిపబ్లికే డే సందర్బంగా జాతీయజెండాను అవిష్కరించిన అనంతరం జనసేనాని పార్టీ కార్యకర్తలు,,నాయకులతో సమావేశం అయ్యారు..ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఇరు పార్టీలు పొత్తులో వున్నప్పుడు చంద్రబాబు, జనసేనతో చర్చించకుండానే సీట్లు ఎలా ప్రకటిస్తారు? అని అడిగారు..సర్దుబాటుకు ముందే అభ్యర్థుల్ని ప్రకటించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.. పొత్తులో ఉండగా మండపేట అభ్యర్థిని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారు? అని ప్రశ్నించారు.. చంద్రబాబే సీఎం అభ్యర్థి అని లోకేష్ ప్రకటించినా నేను మౌనంగా ఉన్నాను కదా ? అని గుర్తు చేశారు.. జగన్ ను గద్దె దించడం కోసమే నేను సంయమనంతో ఉన్నానన్నారు.. పొత్తు విచ్ఛిన్నం కావాలంటే ఎంతసేపు? అని తన భావనను వ్యక్తం చేశారు.. టీడీపీ ప్రకటన జనసేన నేతలను ఆందోళనకు గురిచేసిందని,,అందుకు తాను వాళ్లకు క్షమాపణలు చెప్పుతున్నా అని అన్నారు..మండపేటలో జనసేనకు 18శాతం ఓట్లు వచ్చాయ్, ఇప్పుడది 28శాతానికి పెరిగిందన్నారు..
చంద్రబాబుపై ఒత్తిడి వుంటుందని,,అలాగే తనపై కూడా అలాంటి ఒత్తిడి వుందన్నారు..అందుకే జనసేన కూడా రెండు స్థానాలకు అభ్యర్దులను ప్రకటించదన్నారు..రాజోలు, రాజానగరంలో జనసేనే పోటీ చేస్తుందని,,ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నా అని వివరించారు..పొత్తు ఇబ్బందికరమే…కానీ టీడీపీతోనే కలిసి వెళ్తాం అని తేల్చి చెప్పారు.. పొత్తులో ఉన్నప్పుడు ఒక మాట ఎక్కువా తక్కువా ఉంటుందని,, ఎన్ని ఆటుపోట్లు ఉన్నా టీడీపీతో ముందుకెళ్తామన్నారు..జనసేన పోటీచేసే స్థానాలపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు..అసెంబ్లీ ఎన్నికల్లో 50 నుంచి 70 సీట్లు తీసుకోవాలని కొందరు చెబుతున్నరని,,ఎన్ని సీట్లు తీసుకోవాలో నాకు తెలుసు అని వారికి బదులిచ్చారు..ఒంటరిగా వెళ్తే సీట్లు సాధిస్తాం… కానీ జనసేన ప్రభుత్వం రాదన్నారు.. 2019 ఎన్నికల్లో 18లక్షలకు పైగా ఓట్లు సాధించినట్లు వెల్లడించారు..
ఈ సందర్భంగానే సీఎం జగన్,, వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్దంపై పవన్ వ్యాఖ్యనిస్తూ సొంత చెల్లినే వదలని వ్యక్తి మనల్ని వదులుతారా? అంటూనే… జగన్ కు ఊరంతా శత్రువులే అంటూ చురకలు అంటించారు.. వైసీపీ నేతలకు కష్టం వస్తే నా దగ్గరకే రావాల్సి వస్తుందని చమత్కరించారు..2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వం రాదని ఎన్నికల ఫలితాలపై పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు..నేరుగా మీడియాను అడ్రస్ చేసే ధైర్యం కూడా జగన్ కు లేదన్నారు.. జగన్ పై వ్యక్తిగతంగా నాకెలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *