AMARAVATHINATIONAL

మాంజాదారం కారణంగా ముంబైలో 1000 పక్షులు మృతి

అమరావతి: సంక్రాంతి పండుగ వచ్చిందంటే,,యువకులు గాలి పటాలను ఎగురవేసేందుకు నిషేధించబడిన చైనా మాంజాదారంను ఉపయోగిస్తుంటారు.. చైనా మాంజాదారం మనషుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది..పక్షులకు కూడా ఆ మాంజాదారం చుట్టుకోవడంతో చాలా వరకు ప్రాణాలు కోల్పోతాయి,,అలాగే రెక్కలు,,కాళ్లకు గాయాలు అయ్యి విలవిలలాడిపోతాయి..రెండు రోజుల వ్యవధిలోనే ముంబైలో 1,000 పక్షులు చనిపోగా,,మరో 800 పక్షులు తీవ్రంగా గాయపడ్డాయి.. పక్షి ప్రేమికులు, ముంబై నగర వ్యాప్తంగా 25 ఫ్రీ బర్డ్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు..ఈ కేంద్రాల్లో గాయపడ్డ పక్షులకు ప్రత్యేక చికిత్స అందిస్తూన్నారు.. దహిసర్,,బోరివాలి,,కందివాలి,, మలాద్ ఏరియాల్లో దాదాపు 500లకు పైగా పక్షులను ప్రాణాలతో రక్షించారు..కొన్ని పక్షుల కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో అవి ఎగరలేక పోతున్నాయి..అలాంటి వాటిని ప్రత్యేక షెల్టర్లలో ఉంచి పర్యవేక్షిస్తామని పక్షి ప్రేమికులు తెలిపారు..చికిత్స అనంతరం కొన్ని పక్షులు గాల్లోకి ఎగిరిపోయాయి.. చైనా మాంజా ప్రమాదకరమని,,ఈ దారంను వినియోగించొద్దని ఈ సంవత్సరం సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం జరిగిందని పక్షి ప్రేమికులు తెలిపారు..ఈ మాంజాదారం పక్షులకు తగలడంతో అవి ప్రాణాలు కోల్పోతున్నాయని మనషులకు కూడా ప్రమాదకరంగా మారుతుందని ప్రచారం చేశామన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *