AMARAVATHINATIONAL

సభలో అటకం కలిగిస్తున్న 49 మందిని సస్పెండ్ చేసిన స్పీకర్

మొత్తం-141 మంది..
అమరావతి: గతవారం ఇద్దరు దుండగులు లోక్ సభ హాల్ లోకి ప్రవేశించి స్మోక్ టిన్స్ తో గందరగోళం సృష్టించిన సంగతి విదితమే..ఈ సంఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అదే రోజు మాట్లాడుతూ లోక్,,రాజ్య సభలో భద్రతకు సంబంధించిన ఏదైనా సంఘటన జరిగితే అది సచివాలయం పరిధిలోకి వస్తుందని,, కేంద్ర జోక్యం ఉండదని స్పష్టం చేశారు..అయితే ప్రతిపక్ష సభ్యులు ఈ భద్రతా వైఫల్యంపై హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడాలని డిమాండ్ చేస్తు,,సభలో అటకం కలిగిస్తున్నారు..దీంతో వారిపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేస్తున్నారు..సోమవారం,,మంగళవారం కూడా ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వకపోవడంతో ఏకంగా 49 మందిని స్పీకర్ ఈ శీతాకాల సమవేశాల పూర్తి అయ్యే వరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు..దింతో కలిపి శీతాకాల సమవేశాల్లో సస్పెండ్ అయిన మొత్తం ఎంపీల సంఖ్య 141కి చేరుకుంది..
మిమిక్రీ:- సస్పెండ్ అయిన ఎం.పీలు పార్లమెంట్ భవనం ముందు కుర్చుని,,రాజ్యసభ ఛైర్మన్ జగధీప్ ధన్ కార్ ను అనుకరిస్తు తృణమృల్ కాంగ్రెస్ ఎం.పీ మిమిక్రీ చేయగా,,దిన్ని రాహుల్ గాంధీ సెల్ ఫోన్ లో చిత్రికరించారు..ఈ విషయం తెలిసి రాజ్యసభ చైర్మన్ సీటుకు విలువ ఇవ్వకుండా ఇలా మిమిక్రీలు చేయడంపై అయన అవేదన వ్యక్తం చేశారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *