AMARAVATHINATIONAL

పార్లమెంట్ లోపల,వెలుపల టిన్స్ తో పొగను విడుదల చేసిన 4 వ్యక్తులు అరెస్ట్

ప్రజాస్వామ్యంకు దేవాలయం అయిన పార్లమెంట్ లోకి ప్రవేశించి ఇలాంటి నిరసనలు తెలియచేయడం సమంజసమేనా ?
భారతదేశంలో భావ ప్రకటన స్వేఛ్చ పరిధులు దాటుతుందా అనే విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సివుందా ?
అమరావతి: పార్లమెంటులో పబ్లిక్ గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి లోక్ సభలోకి దూకడం, మరో వ్యక్తి గ్యాలరీ నుంచి ఒక రకమైన పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేయడంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు..ఈ సందర్బంలో అయన లోకసభను ఉద్దేశించి మాట్లాడుతూ, సభా కార్యక్రమాలు జరక్కుండా ఎవ్వరూ నిలువరించలేరని పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చారు.. భద్రతా వైఫల్యంపై స్పీకర్ మాట్లాడుతూ ”సభ జీరో అవర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.. ఈ సంఘటనపై లోక్ సభ,, ఢిల్లీ పోలీసులు విచారణ జరుపుతున్నారు..పొగ వల్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రాథమిక విచారణలో గుర్తించాం” అని స్పీకర్ తెలిపారు..దాడికి పాల్పపడిన ఇద్దరు అనుమానితులు (కర్ణాటకకు చెందిన సాగర్ శర్మ,, మనోరంజన్ లను అదుపులోకి తీసుకుని వారి వద్దనున్న వస్తువులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. పార్లమెంటు భవనం వెలుపల పసుపు రంగు పొగను విడుదల చేసే కంటైనర్లతో నిరసన తెలుపుతున్న హర్యానాలోని హిసార్ కు చెందిన మహిళ నీలం (42), మహారాష్ట్రలోని లాతూర్ కు చెదిన అమోల్ షిండే (25)గా గుర్తించి అదుపులోకి తీసుకున్నమని పోలీసులు తెలిపారు.. (వీరు నాలుగురు పేర్లు నిజమైనవా ? వీరికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలు పోలీసుల లోతైన దర్యప్తులో తేలాల్సివుంది).

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *