గత ప్రభుత్వం హయాంలో డేటా చోరీ జరిగింది?-భూమన

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరోపణలు,,సవాళ్ల మధ్య కొనసాగుతున్నాయి..మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో పెగాసస్ సాప్ట్ వేర్ ఉపయోగించి, డేటా చోరి జరిగినట్లుగా అనుమానలు వున్నయంటూ హౌజ్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి,, సభలో మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టారు..గత ప్రభుత్వం హయాంలో డేటా చోరీ జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని,, 30 లక్షలకు పైగా ఓటర్ల తొలగింపులో భాగంగానే డేటా చోరీ చేశారని, దీనికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు..సేవా మిత్ర యాప్ ద్వారా ఓట్లు తొలగించే ప్రయత్నం చేశారని,డేటాను దుర్వినియోగం చేసినట్లు వెల్లడించారు..ఈ విషయంపై మరింత లోతుగా విచారణ జరగాలంటూ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు..డేటా దొంగలను పట్టుకునేందుకు విచారణ చేస్తున్నామని,,త్వరలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.. 2017-19, 18-19 మధ్యకాలంలో ప్రైవేట్ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని వెల్లడించారు.