AMARAVATHIPOLITICS

అవిశ్వాస తీర్మానంపై 5 సంవత్సరాల క్రిందటే జోస్యం చెప్పిన ప్రధానిమోదీ

అమరావతి: కేంద్ర ప్రభుత్వం మీద విపక్ష పార్టీలు ఉభయసభల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి..తనపై 2023లో కూడా అవిశ్వాస తీర్మానం పెడతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ 5 సంవత్సరాల క్రిందటే (2019)లో జోస్యం చెప్పారు..ఇందుకు సంబంధించి లోక్ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది..2019లో కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.. 2019లో అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ప్రధనామంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘2023లో మళ్లీ అవిశ్వాసం పెట్టే అవకాశం వచ్చేలా మీరు సిద్ధం కావాలని నా తరపున శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను’’ అని అన్నారు..ప్రధాని మోదీ మాట్లాడుతున్న సమయంలో,, ప్రభుత్వానికి అహంకారం పెరిగిందని అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా మల్లిఖార్జనఖర్గే వ్యాఖ్యనించారు..ఇందుకు మోదీ స్పందిస్తూ అహంకారం పర్యవసానంగా 2014 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ సంఖ్య ఒకేసారి 400 నుంచి 40కి పడిపోయిందని,,సేవాభావడంతో కృషి చేస్తున్న తము 2 నుంచి 300 సీట్లకు చేరుకున్నమంటూ చురకలు వేశారు..లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ నాయకుడు గౌరవ్ గొగొయ్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు..ఈ తీర్మానంపై చర్చకు ఆయన సమయం కేటాయించనున్నారు.. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు..రూల్ 198 (B) కింద ఈ అవిశ్వాస నోటీసుపై చర్చ చేపట్టాలని ఎంపీ నామా కోరారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *