నెల్లూరు: జిల్లాకు చెందిన 5 మంది డాక్టర్లు ఉత్తమ కుటుంబ డాక్టర్లుగా ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ ఫిజీషియన్(కుటుంబ వైద్యులు) గా ఉత్తమ సేవలందించిన వారిని జిల్లాల వారీగా ఎంపిక చేసింది. ఆ ప్రకారం జిల్లా నుంచి కలువాయి, చాకలి కొండ, జగదేవపేట, దగదర్తి, దుత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు సురేంద్రబాబు, సృజన, సుచిత్ర, అఖిల, సయ్యద్ అయూబ్ లు ఉత్తమ డాక్టర్లుగా ఎంపికయ్యారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారిని ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ రోణంకి.కూర్మానాద్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ, డిఎంహెచ్వో డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.