మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు క్రియాశీలకంగా పని చేయాలి-సెషన్స్ జడ్జి

నెల్లూరు: మానవ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు క్రియాశీలకంగా పని చేయాలని ఐదవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం మాధురి పిలుపునిచ్చారు. కెపిఆర్ కన్వర్షన్ హాల్ లో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మానవ హక్కుల అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చట్టాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ ప్రసన్నకుమార్ నేషనల్ వర్కింగ్ కమిటీ చైర్మన్ జిల్లా వైస్ చైర్మన్ పి సుజాత స్టేట్ చైర్మన్ రాజా రమేష్ డిస్టిక్ చైర్మన్ జి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.