జమ్ముకశ్మీర్ లో బస్సు లోయ పడిన ఘటనలో 6 గురు జవాన్లు మృతి

అమరావతి: జమ్ముకశ్మీర్ లో మంగళవారం ఉదయం పహల్గామ్ వద్ద సైనికులను తీసుకుని వెళ్తున్న బస్సు,,బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి నదిలో పడిపోయిన ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా,మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి..సమాచారం అందుకుని వెంటనే స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు..చందన్వారి సమీపంలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో బస్సు నదిలోకి పడిపోయింది..ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 39 ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు (ITBP) కాగా మరో ఇద్దరు జమ్మూ కశ్మీర్ పోలీసులు ఉన్నారు..ఈ ప్రమాదంలో ఐటీబీపీ జవాన్లు ఆరుగురు మరణించారు.. అమర్‌నాథ్ యాత్ర ముగియడంతో,, అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది..