AMARAVATHIPOLITICS

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు.. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర సాధికర సభలో బాలకృష్ణ పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ఆరోపించారు..పైకేమో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడని,,లోపల ఎస్సీలని దారుణంగా చంపి డోర్ డెలివరీలు చేశారని ప్రొత్సహిస్తారని ఆరోపించారు.. రూ.1600 కోట్లతో రాష్ట్రమంతా సిద్ధం.. సిద్ధం.. అని హోర్డింగులు పెట్టుకున్నాడని,, దేనికి సిద్ధం కావాలి ? అంటూ ఎద్దేవా చేశారు.. జాబ్ క్యాలెండర్ ఎత్తేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, పరిశ్రమలన్నింటిని తరిమేసి, ఉన్న ఉద్యోగాలని కూడా పీకేశాడని మండిపడ్డారు.. కరెంట్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేశారని, నిత్యవసర సరుకుల ధరలేమో ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు..పోలవరం పూర్తిచేయక పోగా, గోదారిలో ముంచేశారంటూ దుయ్యబట్టారు.. విజయసాయి వైజాగ్‌లో రుషికొండలు తవ్వుకొంటూ నాశనం చేశారని, ఇప్పుడేమో నెల్లూరు వచ్చారనన్నారు.. మంత్రి కాకాణి కాకమ్మ కబుర్లు చెబుతుంటాడని,, ఆయన కళ్లు పడితే భూములన్నీ కబ్జాలే అని ఆరోపించారు.. అభివృద్ది కావాలా? అరాచకాలు కావాలా?, స్వర్ణయుగం కావాలా?.. రాతియుగం కావాలా?, సుపరిపాల కావాలా?.. రాక్షస పాలన కావాలా? సంక్షేమం కావాలా?… చీకటి రాజ్యం కావాలా?… అంటూ ఓటర్లను బాలకృష్ణ ప్రశ్నించారు.. ఈకార్యక్రమంలో నెల్లూరుసిటీ అభ్యర్ది పొంగూరు.నారాయణ,రూరల్ అభ్యర్ది శ్రీధర్ రెడ్డి,ఎం.పి అభ్యర్ది వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *