NATIONAL

ఛత్రపతి శివాజీ థీమ్‌పార్క్‌ ను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా

అమరావతి: ఛత్రపతి శివాజీ పేరు మీద మహారాష్ట్ర లోని పుణేలో ఏర్పాటు చేసిన థీమ్‌పార్క్‌ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం ప్రారంభించారు..ఈ సందర్బంలో హోంమంత్రి మాట్లాడుతూ మొఘల్‌ చక్రవర్తులను ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్యశాలి చత్రపతి శివాజీ అని,,భావితరాలకు ఈ థీమ్‌పార్క్‌ను సందర్శించే వారికి,,శివాజీ జీవితచరిత్రపై పూర్తి అవగాహన వస్తుందన్నారు..ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోని దృశ్యాలను వివిధ కళారూపాలలో ప్రదర్శిస్తారు..అలాగే ఆగ్రాలో ముష్కరుల చెర నుంచి చక్యచక్యంగా ఎలా తప్పించుకున్నారు అనే సంఘటనలను 3D సాంకేతికతను ఉపయోగించి అందించబడింది..మరాఠా సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్న కోటల వైభవాన్ని కళ్లకట్టినట్లు చూపడం జరుగుతుంది..ఈ థీమ్‌పార్క్‌లో శివాజీ జీవితచరిత్రకు సంబంధించిన అన్ని అంశాలను ప్రదర్శిస్తారు..శివాజీ మహారాజ్ జీవితంపై లేజర్‌షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది..శివసృష్టి అని ఈ థీమ్‌పార్క్‌ కు పేరు పెట్టారు..పూణే నగరంలోని అంబేగావ్‌లో రూ.438 కోట్లతో అభివృద్ధి చేయబడిన ఈ ప్రత్యేకమైన ప్రాజెక్ట్ సందర్శకులకు అధ్బుతమైన అనుభూతిని అందిస్తుంది..ఈ ప్రాజెక్టును నాలుగు దశల్లో చేపట్టి 21 ఎకరాల మేర విస్తరించనున్నారు..థీమ్‌ పార్క్‌ తొలిదశ ప్రారంభోత్సవంలో మహారాష్ట్ర సీఎం షిండే,,డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ తదితరులు పాల్గొన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *