అమరావతి: కోవిడ్ మళ్లీ విజృంభిస్తోందన్న వార్తల వస్తున్న నేపథ్యంలో,,ప్రజల్లో ఆపోహలు సృష్టించేందుకు కొంత మంది పనికట్టుకుని ఓ వాట్సాప్ మెసేజ్ ని సర్కూలేట్ చేస్తున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB వేగంగా వ్యాపిస్తోందని,, ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా 5 రెట్లు ప్రమాదకరమైనదని,, దీనివల్ల మరణాల రేటు అధికంగా ఉంటుందని ఈ మెసేజ్ హెచ్చరిస్తోంది. గతంలో వచ్చిన వేరియంట్ల లక్షణాలకన్నా కన్నా దీని లక్షణాలు పూర్తిగా భిన్నమైనవని ఇందులో పేర్కొన్నారు.ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, ఇది తప్పుదోవ పట్టించే బూటకపు మెసేజ్ అని స్పష్టం చేసింది.ఈ మెసేజ్‌ను నమ్మవద్దని, ఇతరులకు పంపించవద్దని ప్రజలను కోరింది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం XBB వేరియంట్ అంతకుముందు వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కన్నా ఎక్కువ ప్రాణాంతకమైనదని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ ప్రాణాంతకమైనదని పేర్కొంది. XBB వేరియంట్,,ఒమిక్రాన్ వెర్షన్స్ కన్నా వేగంగా వ్యాపించగలదని,, అయితే దీనివల్ల సోకే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని తెలిపింది.
కొత్త కోవిడ్-19 వేరియంట్లను సునిశీతంగా గమనిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గురువారం పార్లమెంటుకు తెలిపారు. చైనాలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభల్లోనూ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాప్తి నిరోధం కోసం తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరడం జరిగిందని,,మాస్క్ ధరించాలనే నిబంధనను విధించాలని, జీనోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని చెప్పినట్లు తెలిపారు.