వేగంగా కదులుతున్న “సిత్రాంగ్” తుఫాన్

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్,, తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తుఫాను వచ్చే సమయాలతో పాటు పిడుగులు పడే సమయాలను కూడా వెల్లడిస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది.ఏదైనా అత్యవసర పరిస్థితుల కోసం పోలీసు శాఖ 100కు డయాల్ చేయాలని సూచించింది.సిత్రాంగ్ తుఫాను ఒడిస్సా,వెస్ట్ బెంగాల్,బంగ్లాదేశ్ దిశగా కదిలే అవకాశం వున్నట్లు ఐ.ఎం.డి అధికారులు అంచనా వేస్తున్నారు.తీరప్రాంత ప్రజలు ముందస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.మత్స్యకారులు తుఫాన్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
తుఫాను ముందు , తుఫాను సమయంలో మరియు తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తెలుసుకోవడంతో విపత్తు సంభవించినప్పుడు నష్టాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. #cycloneawareness @APPOLICE100 @IPR_AP pic.twitter.com/pJmTMFYc1m
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 21, 2022