ఈ నెల 7న తెలంగాణ సీ.ఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకరం
హైదరాబాద్: సీఎల్పీ నేతగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా ఎన్నుకోవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఎమ్మెల్యేల అభిప్రాయాలు, సీనియర్లతో చర్చలు,అనంతరం కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పేరును ప్రతిపాదించారు..డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేసీ వేణుగోపాల్,, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క సమక్షంలోనే రేవంత్ పేరును ప్రకటించారు.